
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ జరుగుతున్నది. తాజాగా వీటిని సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి డీఎస్పీ విచారణ ఫైళ్లను సోమవారం (అక్టోబర్ 14) సీఐడీకి అందంచనున్నారు.విచారణను వేగవంతం చేయడానికి ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది.